తెలంగాణ

telangana

ETV Bharat / state

లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ - HYDERABAD CRIME

హైదరాబాద్​ అభ్యుదయనగర్​లోని ఓ లాడ్జిలో పశ్చిమ బంగాకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నారు.

లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​

By

Published : May 8, 2019, 11:51 PM IST

లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​

హైదరాబాద్​ వనస్థలిపురం పరిధి అభ్యుదయనగర్​లోని ఓ లాడ్జిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు పశ్చిమ బంగాకు చెందిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ సంగీతగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం ప్రియుడు లోకేశ్​తో కలిసి సంగీత హైదరాబాద్​ వచ్చినట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం ఫేస్​బుక్​లో సంగీతకు లోకేశ్ పరిచయమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ​ఇరువురి మధ్య ఎదైనా గొడవ జరిగిందా... మరేదైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ​లోకేశ్​​ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details