పంజాగుట్ట పరిధిలోని ఈఎంఎస్ మక్తాలో స్థానికంగా నివాసముండే లక్ష్మి అనే మహిళ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బాధతో బిగ్గరగా అరవడం వల్ల చుట్టు పక్కల స్థానికులు మంటలను అదుపుచేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... లక్ష్మిని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా గాయపడిన ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
పంజాగుట్టలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం - పంజాగుట్ట
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈఎంఎస్ మక్తాలో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తీవ్రంగా గాయపడిన తనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
పంజాగుట్టలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం