ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదర్‌గూడలోని సెయింట్ పాల్ ఎదురుగా ఉన్న సురభి అపార్ట్మెంట్లో బి.కె.కమలాదేవి, భర్త బి.కె.నరేష్ సింగ్ నివాసం ఉంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కమలాదేవి.. తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మహిళ అదృశ్యం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు - నారాయణగూడలో మహిళ మిస్సింగ్
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అదృశ్యమైంది. ఇంటి నుంచి బయటకెళ్లిన కమలాదేవి.. తిరిగి రాలేదు. మహిళ కనిపించకుండా పోవడంపై పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
మహిళ అదృశ్యం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు