లేడీ కిడ్నాపర్ - secendurabad
ప్రేమించాలంటూ వేధిస్తున్న యువకుడిని ఓ యువతి కిడ్నాప్ చేయించింది. అతనిని కొట్టించింది. చివరకు జైలుపాలైంది.
lady
lady
గురువారం దివ్య సాయికుమార్‌కు ఫోన్ చేసి సెయింట్ మేరీస్ కళాశాల వద్దకు రమ్మని చెప్పింది. అక్కడే ఉన్న స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేయించింది. మల్కాజ్గిరి, మీర్జాలగూడ ప్రాంతాలకు తీసుకెళ్లి కొట్టించింది. తప్పించుకున్న బాధితుడు గాంధీ ఆస్పత్రిలో చేరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలను సేకరించి అయిదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ముందుగా దివ్యను కిడ్నాప్ చేసినట్లుగా భావించిన స్థానికులు, 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగా, బాధితుడు ఆసుపత్రికి రావడంతో కేసు మిస్టరీ వీడిందని ఏసీపీ పేర్కొన్నారు.