తెలంగాణ

telangana

ETV Bharat / state

పీపీఈ సూట్ ధరించి డబ్బులు వసూలు చేస్తోన్న నకిలీ డాక్టర్! - విజయవాడ కొవిడ్ ఆస్పత్రిలో మహిళ మోసం

మీ బంధువులు ఎవరైనా ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్నారా ? వాళ్లు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే కొంచెం ఖర్చవుతుంది అంటూ.. ఓ మహిళ నగదు వసూలు చేసిన ఘటన ఏపీలోని విజయవాడలో వెలుగుచూసింది. కరోనా బాధితుల ఆరాటాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తోంది.

విజయవాడ
విజయవాడ

By

Published : Jul 30, 2020, 2:00 PM IST

ఏపీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ పీపీఈ సూట్ ధరించి మరీ మోసానికి పాల్పడుతోంది. మహిళ బయటకు వెళ్తుండగా.. అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది మహిళను నిలువరించారు. తాను డాక్టర్​నని.. పేరు శైలజ అని బుకాయించింది. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

గత కొద్ది రోజులుగా పీపీఈ సూట్ ధరించి, మెడలో స్టెతస్కోప్​తో లోపలికి వెళ్లి.. కొద్ది సేపటి తర్వాత తిరిగి వెళ్లిపోతుంది. గతంలో సిబ్బంది నిలువరించే ప్రయత్నం చేసినా పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న రోగి బంధువుల నుంచి నగదు తీసుకుని లోనికివెళ్లి.. వారికి కావాల్సినవి ఇవ్వటం, అదేవిధంగా వాళ్లు ఎలా ఉన్నారో బంధువులకు చెప్పడం లాంటి పనులు చేస్తోందని పోలీసులు వివరించారు. అదుపులోకి తీసుకున్న మహిళపై గతంలో కేసులున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మహిళతో సహా ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details