సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. ప్రకాశం జిల్లాకు చెందిన నాగేంద్రబాబు, ముగ్గురు చెల్లెళ్లతో కలిసి నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. పటాన్చెరు శివారులోని ఏపీఆర్ కాలనీ సమీపంలో గుడిసె వేసుకుని స్థానికంగా మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
పటాన్చెరులో యువతి అదృశ్యం - సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో యువతి అదృశ్యం కలకలం రేపింది. బహిర్భూమికి అని వెళ్లిన యువతి కనిపించకుండా పోగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పటాన్చెరులో యువతి అదృశ్యం
ఈ క్రమంలో నాగేంద్రబాబు రెండో చెల్లెలు లక్ష్మీ శిరీష.. మంగళవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. చెల్లి అదృశ్యంపై అన్న నాగేంద్రబాబు ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.