తెలంగాణ

telangana

ETV Bharat / state

సిబ్బంది నిర్లక్ష్యం... రోడ్డుపైనే మహిళ ప్రసవం - lady-delivery-on-road

నెలలు నిండాయని ఆసుపత్రికొచ్చిన ఓ గర్భిణీ పట్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. అవగాహన లోపంతో పలు వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి పంపిచేశారు. వారి నిర్వాకంతో ఆ మహిళ ఎర్రటి ఎండలో రోడ్డుపైనే ప్రసవించాల్సిన దయనీయ పరిస్థితి ఎదురైంది.

దయనీయ పరిస్థితి....

By

Published : Apr 6, 2019, 11:31 PM IST

హైదరాబాద్​ హయత్​నగర్​లోని తారమతిపేటకు చెందిన మేరమ్మ అనే మహిళ ప్రసవం కోసం వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లింది. పండగరోజు కావడం వల్ల వైద్యులు లేరని సిబ్బందే పలు వైద్య పరీక్షలు చేశారు. అంతా బాగుందని.. రెండు మూడు రోజుల తర్వాత రావాలని సూచించారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా ఎల్బీనగర్​లో రోడ్డుపక్కనే ప్రసవం జరిగిందని భర్త వాపోయాడు.

దయనీయ పరిస్థితి....

చలించిన స్థానికులు...

రోడ్డుపైనే మగ బిడ్డకు జన్మనిచ్చిన మహిళను చూసి స్థానికులు చలించిపోయారు. అంబులెన్స్​కి ఫోన్​ చేసి సమాచారమిచ్చి కోఠి ఆసుపత్రికి తరలించారు. పండగ రోజు కావటం... ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడ సిబ్బంది లేకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి: అంధుడైనా సడలని ఆత్మవిశ్వాసం.. ఎందరికో ఆదర్శం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details