మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లోని సాయిభవానీ కాలనీలోని ప్రధాన రహదారి పక్కన ఈ ఏడాది కొత్తగా మద్యం దుకాణం మంజూరైంది. షాపు ఏర్పాటుకు సదరు వ్యాపారి అద్దె కోసం గాలించాడు. ఇంటి యజమానులు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల సమీపంలో ఉన్న ఖాళీస్థలంలో రెండు గదులు నిర్మిస్తున్నాడు. విషయం తెలుసుకున్న కాలనీ మహిళలు ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్న ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు. దీనిపై అధికారులకు, మంత్రి మల్లారెడ్డికి వినతులు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. దుకాణం ఏర్పాటు నిర్ణయం విరమించుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
మద్యం దుకాణం వద్దని మహిళల పోరు
ప్రశాంతంగా ఉండే ఆ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని అక్కడున్న మహిళలు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. షాపు కోసం నిర్మిస్తున్న గదుల వద్దకు వచ్చి ఫర్నీచర్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లోని సాయిభవానీ కాలనీలో జరిగింది.
మద్యంపై మహిళల పోరు