తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంజినీరింగ్​లో భారీగా సీట్లు మిగిలే అవకాశం - engineering seats in telangana

రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజినీరింగ్​ సీట్ల భర్తీ దారుణంగా పడిపోయింది. ఈ ఏడాది భారీగా సీట్లు మిగిలే అవకాశం ఉండొచ్చని కళాశాలల నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కన్వీనర్​ కోటాలో 69,116 బీటెక్​ సీట్లు ఉండగా... 5,417 మంది మాత్రమే వెబ్​ ఆప్షన్లు ఇచ్చారు.

engineering
ఇంజినీరింగ్​లో భారీగా సీట్లు మిగిలే అవకాశం

By

Published : Oct 22, 2020, 10:53 PM IST

ఇంజినీరింగ్​లో ఈ ఏడాది భారీగా సీట్లు మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కన్వీనర్ కోటాలో 69, 116 బీటెక్ సీట్లు ఉండగా... 5, 417 మంది విద్యార్థులే వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వారిలో నచ్చిన సీటు దక్కకపోతే కొందరు చేరక పోవచ్చు. ఈ ఏడాది ఎంసెట్​కు లక్ష 19 వేల 183 మంది హాజరు కాగా.. వారిలో 89, 734 మంది ఉత్తీర్ణులయ్యారు. కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీ కోసం నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ ప్రక్రియలో ధ్రువపత్రాల పరిశీలనకు 55 వేల 531 మందే హాజరయ్యారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన వారిలో దాదాపు 1,500 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వలేదు. మొదటి విడతలో దాదాపు 16వేలకు పైగా సీట్లు మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.

ముఖ్యంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి విభాగాల్లో సీట్లు పూర్తిగా భర్తీ కాకపోవచ్చునని కళాశాలల నిర్వాహకుల అంచనా. ఈ ఏడాది కొత్త కోర్సులకే విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపినట్లు తెలిపింది. ఈనెల 24న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లు కేటాయించనున్నారు. మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈనెల 29 నుంచి తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఇవీ చూడండి: ఈనెల 27 నుంచి వ్యవసాయ డిప్లోమా కౌన్సిలింగ్

ABOUT THE AUTHOR

...view details