ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలు సౌలభ్యంగా లేవని, భద్రతా ప్రమాణాలు కూడా లేవని సాంకేతిక కమిటీ తేల్చి చెప్పింది. ఈఎన్సీలు భవనాలను పరిశీలించి మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేశారు. వారు అగ్నిమాపక శాఖ నుంచి కూడా నివేదిక తీసుకున్నారు. సచివాలయ భవనాల విభాగం నుంచి కూడా వివరాలు సేకరించి వీటన్నింటిని నివేదికలో పొందుపరిచారు. సచివాలయంలో పార్కింగ్ వసతి లేదని, సరైన వ్యవస్థ లేదని కమిటీ తేల్చింది. మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాలతో పాటు ఆయా విభాగాలు ఒకే దగ్గర లేకుండా విసిరేసినట్లున్నాయని పేర్కొంది.
సచివాలయ భవనాల్లో భద్రత ప్రమాణాలు లేవట! - Secretariat buildings
సచివాలయ భవనాలు సౌలభ్యంగా లేవని, భద్రతా ప్రమాణాలు కూడా లేవని సాంకేతిక కమిటీ తేల్చింది. భవనాల స్థితిగతులను పరిశీలించిన ఈఎన్సీలు నివేదికను ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, సభ్యులు శ్రీనివాస్ గౌడ్‌కు అందజేశారు.

నివేది అందిస్తున్న ఈఎన్సీలు
సచివాలయ భవనాల్లో భద్రత ప్రమాణాలు లేవట!
ఇదీ చూడండి :హెల్మెట్ పెట్టుకుంటేనే జైల్లోకి.