Sarpanch fires on govt: సరిపడ నిధుల్లేక గ్రామాల్లో సరైన రోడ్లు కూడా వేయించలేని దుస్థితిలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షేక్షానుపల్లి వైకాపా సర్పంచ్ లింగన్న అన్నారు. మండలస్థాయిలో జరిగిన సాధారణ సమావేశంలో సర్పంచ్ లింగన్న గ్రామ సమస్యలపై అధికారులను నిలదీశారు. అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇవ్వలేనపుడు తమను సమావేశాలకు ఎందుకు పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. అధికారుల దృష్టికి పలుమార్లు సమస్యలు తీసుకువచ్చినా వాటిని పట్టించుకోవడం లేదని సర్పంచ్ ఆరోపించారు.
'నిధులివ్వకుండా, సభలకెందుకు రమ్మంటారు' - ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గ్రామ సర్పంచ్
Sarpanch fires on govt.: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం సరిపడ నిధులు ఇవ్వకపోవడంపై ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షేక్షానుపల్లి వైకాపా సర్పంచ్ లింగన్న ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
!['నిధులివ్వకుండా, సభలకెందుకు రమ్మంటారు' ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17192320-628-17192320-1670917373515.jpg)
ap
Last Updated : Dec 13, 2022, 1:40 PM IST