గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆరోగ్య కేంద్రాల్లో.. సౌకర్యాల కొరత వేధిస్తోంది. కొవిడ్ రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో వ్యాధి నిర్ధరణ పరీక్షలకు వచ్చే ప్రజలు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొద్దంతా ఎండలో పడిగాపులు కాసి.. టెస్టింగ్ కిట్లు లేక, వ్యాక్సిన్ కొరత కారణంగా నిరాశతో వెనుదిరుగుతున్నారు. కేంద్రాల్లో.. బాధితులు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేక రోడ్లపైన గంటల తరబడి నిలబడుతూ అవస్థలు పడుతున్నారు.
ముషీరాబాద్, భోలక్ పూర్లోని రంగానగర్, దోమల్ గూడలోని గగన్ మహల్, కవాడిగూడలోని నెహ్రూ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు కరోనా అనుమానిత బాధితులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వ్యాధి నిర్ధరణ పరీక్షలు, నిరోధక టీకాల కోసం ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో డిమాండ్‌కు తగ్గ వసతులు లేక.. వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.