Lack of Facilities at Uppal Stadium: ఉప్పల్ అంతార్జాతీయక్రికెట్ స్టేడియంను 2004లో.. అప్పటి సాంకేతికతకు అనుగుణంగా నిర్మించారు. సుమారు 50,000కు పైగా ప్రేక్షకులు వీక్షించేలా నిర్మాణం చేశారు. 2005 నవంబర్ 16న దక్షిణాఫ్రికాతో తొలివన్డే జరిగింది. చివరిగా ఈ జనవరి 18న.. న్యూజిల్యాండ్‌తో వన్డే నిర్వహించారు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ప్రతి సీజన్‌లో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. స్టేడియం నిర్మించి 17 ఏళ్లు దాటినా ఊహించినంత అభివృద్ధి జరగలేదు.
Uppal Stadium Issues : ఏటేటా మ్యాచ్ చూసేందుకు వచ్చే క్రికెట్ అభిమానుల సంఖ్య పెరుగుతున్నా సరైన సౌకర్యాలు లేవు. మంచినీరు లభించని పరిస్థితి. నిధులు సరిపోకవడం సహా హెచ్‌సీఏలో నెలకొన్న అంతర్గతపోరుతో స్టేడియం ఈ దుస్థితికి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. స్టేడియంలో ప్రేక్షకులు కూర్చునే సీట్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ఎండకుఎండి, వానకు తడిచి పొట్లిపోయి విరిగిపోయాయి. నాలుగేళ్ల విరామం తర్వాత గతేడాది ఆస్ట్రేలియా- భారత్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ సమయంలోనూ చాలా సీట్లు ఊడిపోయాయి.
అప్పటికప్పుడు కొన్నింటిని తెప్పించి తాత్కాలికంగా సరిపెట్టారు. ఆ మ్యాచ్ తర్వాత ఏర్పాట్ల విషయంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు ఆజారుద్దీన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ జనవరిలో న్యూజిల్యాండ్‌తో జరిగిన వన్డే సమయంలోనూ అదే పరిస్థితి. ఇటీవల అధ్యక్ష పదవీకాలం ముగియడంతో హెచ్‌సీఏ కార్యకలాపాలు సహాఎన్నికల నిర్వహణకు జస్టిస్ లావు నాగేశ్వరావును సుప్రీంకోర్టు నియమించింది. పాలనా అధికారిగా విశ్రాంత ఐపీఎస్ ఆధికారి దుర్గాప్రసాద్‌ని నియమించారు.
ఒక్కోసమస్య వెలుగులోకి: ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్బంగా స్టేడియంలో ఒక్కోసమస్య వెలుగులోకి వస్తోంది. కేవలం సీట్లు, క్యనోపి కాదు స్టేడియంలో డ్రైనేజి సమస్య తీవ్రంగా ఉంది. లోపల ఏర్పాటుచేసిన టీవీలు, ఏసీలు సరిగా పనిచేయడంలేదు వాటిని మార్చాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఎల్‌ఈడీలు అమర్చాల్సి ఉంది. గ్రౌండ్‌లో ఆడే క్రీడాకారుతోపాటు ప్రేక్షకుల కోసం ప్రతి స్టేడియంలో భారీ తెరలుంటాయి. వాటిద్వారా ఆటగాళ్లు రివ్యూలు, స్కోర్ వివరాలు, థర్డ్ అంపైర్ నిర్ణయాలు తెలుస్తాయి.