హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని నూతన భవన నిర్మాణ పనుల్లో అపశృతి సంభవించింది. కర్నూల్ నుంచి జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన మహాదేవ్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. మాసబ్‌ట్యాంక్‌లోని నూతన భవన నిర్మాణం వద్ద బుధవారం పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గోడపై నుంచి కిందపడ్డాడు. తలకు బలమైన గాయం తగలడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు.
భవనం పైనుంచి పడి కూలీ మృతి - భవనంపై నుంచి పడి కూలీ మృతి
కొత్త భవన నిర్మాణ పనుల్లో అపశృతి జరిగింది. భవనాన్ని నిర్మిస్తున్న గోడపై నుంచి ప్రమాదవశాత్తు ఓ కూలీ కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన నిన్న హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో చోటుచేసుకుంది.
భవనం పైనుంచి పడి కూలీ మృతి
సమాచారం తెలుసుకున్న హుమాయూన్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి :సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగాల ప్రచారం.. జాగ్రత్త!