హైదరాబాద్‌లో నిరుపేద కూలీల జీవితం దయనీయంగా మారింది. పని దొరక్క.. తినడానికి తిండిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలకు తిండి పెట్టలేక ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఖైరతాబాద్ పరిధిలోని చింతల్‌బస్తీలో రాజు అనే కూలీ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
గొంతు కోసుకొని కూలీ ఆత్మహత్యాయత్నం - coronavirus news
కరోనా నివారణకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కూలీల పాలిట యమపాశమైంది. పనికి వెళ్తే గాని రోజు గడవని వారు పస్తులుంటున్నారు. ఎవరైనా ఆపన్నహస్తం అందిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఆశ నిరాశే అయింది. ఆదుకునే వారు లేక.. నాన్నా ఆకలి అంటున్న పిల్లల ఆక్రందన వినలేక.. వారికి తిండి పెట్టే దారి తెలియక.. ఏం చేయాలో అర్థం కాక.. తండ్రిగా ఓడిపోయానంటూ తనువు చాలించాలనుకున్నాడు ఓ నిరుపేద తండ్రి. గొంతు కోసుకుకోని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

గొంతు కోసుకొని కూలీ ఆత్మహత్యాయత్నం
చింతల్‌బస్తీలో రాజు భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. రోజువారీ కూలీ పనులు చేసుకుని ఉపాధి పొందే ఇతనికి కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతుండడం వల్ల కూలీ దొరక్క ఇబ్బందులు పడుతున్నాడు. మద్యానికి బానిసగా మారిన రాజు మద్యం లభించకపోవడం కూలీ దొరక్కపోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురి ఆత్మహత్యాయత్నం చేశాడు.
గొంతు కోసుకొని కూలీ ఆత్మహత్యాయత్నం
ఇదీ చదవండి:కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ