మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుది శ్వాస విడిచినట్లుగా అపోలో వైద్యులు ప్రకటించారు. కరోనాతో నాయిని ఆసుపత్రిలో చేరారాని.. తీవ్రమైన లంగ్ ఇన్‌ఫెక్షన్ కావడంతో మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.
గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన కోలుకుని ఇంటికి వస్తారని అనుకున్నారు. గతవారం ఆయనకు ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. దీంతో పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఈనెల 13న హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పల్మనాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సునీతారెడ్డి, కిడ్నీ స్పెషలిస్టు డాక్టర్ రవి ఆండ్రూస్, మరో డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డిల పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చికిత్సకు నాయిని శరీరం సహకరించకపోవడం వల్ల డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు.
ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం కేసీఆర్