భూస్వాముల అరాచకాలకు అడ్డుకట్ట వేసే దిశగా కృషి చేసిన మహనీయుడు పరిటాల రవి అనితెతెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ కొనియాడారు . పరిటాల రవి వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రమణ ప్రారంభించారు.
'చనిపోయే వరకు ప్రజాశ్రేయస్సుకు పాటుపడ్డారు'
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దివంగత నేత పరిటాల రవి వర్ధంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని తెతెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ ప్రారంభించారు.
ramana
కార్యక్రమంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి, తెలుగు మహిళా అధ్యక్షురాలు జోత్స్న సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పరిటాల రవి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీలో చేరిన నాటి నుంచి చనిపోయే క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసం పరిటాల రవి పాటుపడ్డారని నాయకులు గుర్తు చేసుకున్నారు.
ఇవీ చూడండి: రేపు సాయంత్రంలోగా రానున్న మున్సిపల్ ఫలితాలు