తెదేపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ ఇటీవల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా తెరాస పార్టీ సభ్యత్వం స్వీకరించారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యలో రమణ తన అభిమానులు, నేతలతో కలిసి ఊరేగింపుగా వచ్చి గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనుచరులతో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఉద్యమం చేసిన వారందరు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
L.RAMANA: కేసీఆర్ సమక్షంలో తెరాస కండువా కప్పుకోనున్న ఎల్.రమణ - తెరాసలో చేరనున్న ఎల్‌రమణ
ఇటీవల కేటీఆర్ సమక్షంలో తెరాస సభ్యత్వం తీసుకున్న ఎల్.రమణ... నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. కేసీఆర్ నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని రమణ వెల్లడించారు.
తెరాస కండువా కప్పుకోనున్న ఎల్ రమణ
కేసీఆర్ నేతృత్వంలో ఎల్.రమణ తెరాస కండువా కప్పుకోనున్నారు. ఇందుకోసం తెలంగాణ భవన్లో సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు, చేనేత సంఘాల నేతలు పాల్గొననున్నారు.
ఇదీ చూడండి: గులాబీ గూటికి ఎల్. రమణ