CM KCR: 'మెట్రోకు ఎలా సాయం చేయవచ్చో సమీక్షించండి' - telangana latest news
21:47 June 25
CM KCR: 'మెట్రోకు ఎలా సాయం చేయవచ్చో సమీక్షించండి'
మెట్రో రైల్ నిబంధనలకు అనుగుణంగా ఎల్ అండ్ టీ సంస్థకు ప్రభుత్వపరంగా ఏ విధంగా సహాయం అందించవచ్చో సమీక్షించి నివేదిక అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైల్ రవాణా అంశంపై చర్చించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ సీఈవో సుబ్రహ్మణ్యం ప్రగతిభవన్‌లో సీఎంతో సమావేశమయ్యారు. మంత్రులు, అధికారులు, ఎల్ అండ్ టీ, మెట్రో అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
కరోనా పరిస్థితుల్లో ప్రయాణికులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మెట్రోను మరింత సమర్థంగా నడిపించే దిశగా వినూత్న చర్యలకు పూనుకోవాలని.. అందుకు రాష్ట్రప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. కరోనా మూలంగా మెట్రో నష్టాల్లో నడుస్తోందని.. ఈ పరిస్థితుల్లో తమకు సహకారం అందించాలని ఎల్ అండ్ టీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో మెట్రో రైలుకు సంబంధించిన రవాణా, తదితర అంశాలు చర్చించిన సీఎం.. వారి అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందించారు. మెట్రో రైలుకు సంబంధించి, ఎల్ అండ్ టీ సంస్థకు, ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఏ మేరకు సహాయం చేయవచ్చో పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. దీనిపై సమీక్ష నిర్వహించి నివేదికను అందించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: Cm Kcr: ఎస్సీల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు: సీఎం