తెలంగాణ

telangana

ETV Bharat / state

అశ్వత్థామ రెడ్డి, థామ‌స్ రెడ్డిల‌ను పెంచి పోషించింది కేసీఆర్ కాదా ?? - ముఖ్యమంత్రి స్థాయిని దిగ‌జార్చేలా కేసీఆర్ మాట్లాడారు

ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవ‌ణ్ తప్పుబట్టారు. ఆర్టీసీ ఆస్తులపై వెంటనే శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఆనాడు ఈ విజ్ఞత ఎక్కడికి పోయింది : శ్రవణ్

By

Published : Oct 25, 2019, 6:05 PM IST

ఆర్టీసీ కార్మికుల ప‌ట్ల ముఖ్యమంత్రి స్థాయిని దిగ‌జార్చేలా కేసీఆర్ మాట్లాడార‌ని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవ‌ణ్ ఆరోపించారు. ఆర్టీసీకి చెందిన ఆస్తులు, అప్పులు, ఆదాయంపై వెంటనే శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల‌ను క‌డుపులో పెట్టుకుని చూసుకోకపోగా.. వాళ్ల క‌డుపుపై త‌ంతా అన‌డం బాధాక‌ర‌మ‌న్నారు. తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో టీఎంయూను ఏర్పాటు చేయించి అశ్వథామ రెడ్డిని, థామ‌స్ రెడ్డిల‌ను పెంచి పోషించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. అప్పుడు ఆర్టీసీ కార్మికులతో సమ్మె చేయించిన కేసీఆర్‌ ఇప్పుడు వారిని విమర్శించడం సరికాదన్నారు. సీఎంని తిట్టొచ్చా అంటున్న కేసీఆర్ నాడు సోనియా గాంధీని తిట్టిన రోజు ఈ విజ్ఞత ఎక్కడికి పోయింద‌ని ఎద్దేవా చేశారు. యూనియ‌న్లు ఏర్పాటు చేసుకోవ‌డం కార్మికుల రాజ్యాంగ‌ప‌ర‌మైన హ‌క్కు అని శ్రవణ్ అన్నారు. కేసీఆర్ పుట్టక ముందే యూనియ‌న్లు పుట్టాయ‌న్నారు.

ఆనాడు ఈ విజ్ఞత ఎక్కడికి పోయింది : శ్రవణ్

ABOUT THE AUTHOR

...view details