మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు వారసురాలు సురభి వాణీదేవి విజయం ఓ చారిత్రక సందర్భమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. శాసనమండలిలో అడుగుపెట్టబోతున్న ఆమెకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఆమె విజయం ఓ చారిత్రక సందర్భం: కేవీ రమణాచారి - కేవీ రమణాచారి శుభాకాంక్షలు
పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కేవీ రమణాచారి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె విజయం ఓ చారిత్రక ఘట్టమని అన్నారు.
ఆమె విజయం ఓ చారిత్రక సందర్బం: కేవీ రమణాచారి
పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన కూతురును ఎమ్మెల్సీగా గెలిపించడం ఆయనకిచ్చే అసలైన నివాళి అని రమణాచారి పేర్కొన్నారు. విద్యావంతులైన పట్టభద్రులు సీఎం కేసీఆర్‌కు వాణీదేవి విజయాన్ని బహుమానంగా అందించారని తెలిపారు. ఆమెకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి గెలిపించిన ముఖ్యమంత్రికి కేవీ రమణాచారి ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి:ఘనంగా మంత్రి ఈటల జన్మదిన వేడుకలు
Last Updated : Mar 20, 2021, 10:32 PM IST