ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు.
వాషింగ్టన్‌లోని 'మన కోసం ఫౌండేషన్' సభ్యులు భారతీయ సేవా సమితి ఫౌండేషన్ విజ్ఞప్తి మేరకు.. ఏడు లీటర్ల కెపాసిటీ గల ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను ఈ సందర్భంగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు ఉచితంగా అందజేశారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు వేణుగోపాల చారి, బిఎస్ఎస్ఎఫ్ సభ్యులు శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.