కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందిపడుతున్నవారిని గుర్తించి సంపన్నులు ముందుకు వచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి కోరారు. లాక్డౌన్ కారణంగా కళాకారులు ఇబ్బంది పడుతున్నారని గమనించి... తనకు తోచిన సహాయం అందించినట్లు కేవీ రమణాచారి అన్నారు.
కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేసిన కేవీ రమణాచారి - kv ramanachari distributed groceries at hyderabad
హైదరాబాద్ బొగ్గులకుంటలోని 100 మంది జానపద, 100 మంది నాటక కళాకారులకు, 50 మంది బ్రాహ్మణులకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్డౌన్ వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తనకు తోచిన సాయం అందించినట్లు ఆయన తెలిపారు.
![కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేసిన కేవీ రమణాచారి distributed groceries at hyderabad by kv ramanachari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7873926-851-7873926-1593764814920.jpg)
కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేసిన కేవీ రమణాచారి
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్ స్ఫూర్తితో హరే కృష్ణ ఫౌండేషన్, అక్షయపాత్ర ఫౌండేషన్, మైటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నందా పాండే వారి సౌజన్యంతో హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ వద్ద 100 మంది జానపద, 100 మంది నాటక కళాకారులకు, 50 మంది బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు అందజేశారు.