ఉపాధి కోల్పోయిన కళాకారులకు ఆర్థిక సాయం చేయడం కాకుండా.. వారికి ప్రత్యామ్నయంగా ప్రదర్శనలిచ్చే ఏర్పాటు చేసి.. ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ప్రభుత్వాన్ని కోరారు. జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఆయన నాంపల్లిలోని తన నివాసంలో బోనాల కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
కళాకారులకు ప్రదర్శనలతో ఉపాధి కల్పించాలి: కేవీ రమణాచారి
లాక్డౌన్ సమయంలో ప్రదర్శనలు లేక ఉపాధి కోల్పోయిన కళాకారులకు ఆర్థికసాయం చేసేకంటే.. ప్రత్యామ్నయంగా వారికి ప్రదర్శనలు ఇచ్చేలా ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ప్రభుత్వాన్ని కోరారు. నాంపల్లిలోని ఆయన నివాసంలో ఆయన బోనాల కళాకారులకు నిత్యావసరాలు అందజేశారు.
కళాకారులకు.. ఉపాధి కల్పించాలి : కేవీ రమణాచారి
లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వం ఉన్న 30వేల మంది కళాకారులకు విడతల వారిగా నిత్యావసర సరుకులు అందజేస్తామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: వాతావరణం: బలపడనున్న అల్పపీడనం.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు