తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్రాహ్మణులకు నిత్యావసరాల పంపిణీ

ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం చేయకపోతే సమాజం ముందుకు కదలదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారి అన్నారు. కరోనా విపత్కర సమయంలో ఉన్నవారు లేని వారికి సహాయం చేయాలని సూచించారు.

By

Published : May 29, 2020, 4:59 PM IST

Hyderabad District latest news
Hyderabad District latest news

హైదరాబాద్ బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మైటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నందా పాండే తన భర్త స్మారకంగా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారితోపాటు దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్​ రెడ్డి హాజరై... వందమంది బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను అందజేశారు.

బ్రాహ్మణ పరిషత్​తోపాటు ప్రభుత్వం తరఫున బ్రాహ్మణులకు సాాయం చేస్తున్నప్పటికీ... కొవిడ్​ విపత్కర సమయంలో దాతలు కూడా ముందుకు రావాలని రమణా చారి కోరారు. తెల్ల రేషన్​ కార్డ్ లేని బ్రాహ్మణులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వేణుగోపాల చారి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details