తెలంగాణ

telangana

ETV Bharat / state

వందే భారత్​ మిషన్: కువైట్​ టూ హైదరాబాద్ - vande bharat mission updates

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం తలపెట్టిన వందే భారత్ మిషన్‌లో భాగంగా కువైట్ నుంచి తొలి విమానం హైదరాబాద్‌కి వచ్చింది. తమ పేర్లను నమోదు చేసుకున్న వారిని దశల వారీగా భారత్​కు తీసుకొస్తున్నారు. కువైట్ నుంచి 163 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి 10 గంటల సమయంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. వారికి థర్మల్ స్క్రీనింగ్ తర్వాత క్వారంటైన్‌కు తరలించారు.

Kuwait flight landed in Hyderabad
కువైట్​ టూ హైదరాబాద్

By

Published : May 10, 2020, 11:34 AM IST

కువైట్​ టూ హైదరాబాద్

కేంద్రప్రభుత్వ చొరవతో విదేశాల్లో చిక్కుకున్న వారు క్రమంగా స్వదేశానికి వస్తున్నారు. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా కువైట్‌ నుంచి తొలి విమానం హైదరాబాద్‌కు చేరుకుంది. చాలా విరామం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టినవారంతా ఆనందపడ్డారు.

ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్..

కేంద్ర మార్గదర్శకాల మేరకు ప్రతీ ప్రయాణికుడికి థర్మల్ కెమెరాల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించారు. భౌతికదూరం పాటించేలా విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద గ్లాస్ షీల్డులను ఏర్పాటు చేశారు. లగేజ్ బెల్టుతో అనుసంధానించిన డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా ప్రయాణికుల బ్యాగేజీని శానిటైజ్ చేశారు. ప్రయాణికులను నగరంలో ముందుగా గుర్తించిన ప్రదేశాలకు 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌కు ప్రత్యేక బస్సుల్లో తరలించారు.

పర్యవేక్షించిన సజ్జనార్..

ఎయిరోబ్రిడ్జి నుంచి బయటికి వచ్చేంత వరకు ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భౌతిక దూరాన్ని పాటించారు. విమానాశ్రయంలో పరిస్థితిని ఎప్పటికప్పడు సైబరాబాద్ సీపీ సజ్జనార్ పర్యవేక్షించారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రయాణికులను క్వారంటైన్ కు తరలించామని సజ్జనార్ వివరించారు. ప్రయాణికులు వెళ్లిన అనంతరం ఎయిర్‌పోర్ట్‌ మొత్తాన్ని మరోసారి పూర్తిగా శానిటైజ్ చేశారు.

ఇవీ చూడండి: ' అమ్మ మనసు గెలుచుకోవడమే అసలైన పరమార్థం'

ABOUT THE AUTHOR

...view details