తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్ - ఎమ్మెల్యేకు కరోనా వార్తలు
06:24 July 20
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు కరోనా పాజిటివ్
రాష్ట్రంలో కరోనా తన పంజా విసురుతూనే ఉంది. ప్రజా ప్రతినిధులు సైతం వైరస్ భారిన పడుతూనే ఉన్నారు. తాజాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు కరోనా పాజిటివ్‌గా అధికారులు నిర్ధరించారు. ఎమ్మెల్యే సతీమణి, కుమారుడు, పనిమనిషికి వైరస్ సోకినట్లు మేడ్చల్ డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆనంద్ వెల్లడించారు.
ఇప్పటివరకు..
వివేకానందతో కలిపి రాష్ట్రంలో ఆరుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. తెరాసకు చెందిన ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, గణేష్ గుప్తా, నల్లమోతు భాస్కరరావు, వివేకానంద వైరస్ బారిన పడగా... భాజపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా సోకింది.