మేడ్చల్ జిల్లా కుషాయిగూడ మంగాపురం కాలనీలో కోన మహేశ్వరితో పాటు కుమార్తె, కుమారుడు అదృశ్యమైన కేసు కథ సుఖాంతమైంది. తన భర్త కోన నరేశ్ చాలా సార్లు తనని అనుమానిస్తుండటం వల్ల కలత చెందానని బాధితురాలు తెలిపింది. తనకు పరిచయమున్న శ్రీను అనే వ్యక్తికి విషయం మొత్తం చెప్పి బాధపడగా... అదే అదునుగా భావించి అతను... మహేశ్వరి, ఆమె పిల్లలకు కొత్త జీవితాన్ని అందిస్తానని నమ్మించినట్లు వెల్లడించింది.
అదృశ్యం కేసు సుఖాంతం... తప్పు తెలుసుకుని తిరిగొచ్చిన బాధితురాలు - crime news
కుమార్తె, కుమారునితో అదృశ్యమైన మేడ్చల్ జిల్లా కుషాయిగూడకు చెందిన మహిళ తిరిగి ఇంటికి చేరుకుంది. భర్త పెట్టే బాధను పరిచయమున్న వ్యక్తితో పంచుకోగా... అదే అదునుగా చేసుకుని నిందితుడు పన్నాగం పన్నాడు. బాధితురాలు, పిల్లలకు కొత్త జీవితాన్నిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించి తీసుకెళ్లాడు. చేసిన తప్పు తెలుసుకున్న మహిళ తన పిల్లలతో తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుకుంది.
kushaiguda missing women reached home safely
ఈ నెల 4 న తనను, తన పిల్లల్ని ఇంటి నుంచి తీసుకెళ్లి కాప్రా సర్కిల్ గాంధీనగర్లో నివాసముంచాడని చెప్పింది. తరువాత తాను చేసిన తప్పు తెలుసుకొని... శ్రీను లేని సమయంలో ఈరోజు ఉదయం తన ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని భర్తకు చెప్పగా... కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించి నిందితుడు శ్రీనును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.