'రుజువైతే... విద్యాశాఖ మంత్రిని తొలగించాలి'
విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కుంతియా మండిపడ్డారు. ఈనెల 29న అన్ని పార్టీలతో కలిసి ధర్నాకు దిగుతామని పేర్కొన్నారు.
విద్యాశాఖ మంత్రిని తొలగించాలి: కుంతియా
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అవకతవకలపై ఎవరిని బాధ్యుల్నిచేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కుంతియా ప్రశ్నించారు. పరీక్ష ఫలితాలపై మంత్రి వ్యవహరించిన తీరు సరికాదని వ్యాఖ్యానించారు. పరీక్ష నిర్వహణలో లోపాలను ఎత్తిచూపిన కమిటీ నివేదికపై ప్రభుత్వం స్పందించటం లేదని మండిపడ్డారు. ఈనెల 29న అన్ని పార్టీలతో కలిసి ధర్నాకు దిగుతామని ప్రకటించారు. తప్పులు జరిగాయని రుజువైతే.. విద్యాశాఖ మంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు.
Last Updated : Apr 28, 2019, 5:15 PM IST