ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో తన దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఓ టెర్రరిస్టును, దొంగను అరెస్టు చేసినట్లు... పోలీసులు తనను నిమ్స్‌కు తరలించారని సాంబశివరావు వెల్లడించారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని కూనంనేని స్పష్టం చేశారు.
'నిమ్స్ నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తా' - ఆర్టీసీ డిమాండ్లు నెరవేర్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తా
పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దీక్షను విరమించేది లేదన్నారు సీపీఐ నేత కూనంనేని. అర్ధరాత్రి... కనీసం బట్టలు మార్చుకునే అవకాశమివ్వకుండా పోలీసులు తనను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నిమ్స్ నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తా'