నిమ్స్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కూనంనేని సాంబశివరావు తన దీక్షను విరమించారు. సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్‌రెడ్డి, నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెజస అధ్యక్షడు కోదండరాం, తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత వీహెచ్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు, జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఆర్టీసీ ఐకాస కన్వీనర్అశ్వత్థామరెడ్డి, కూనంనేనితో దీక్ష విరమింపజేశారు. ఆర్టీసీ కార్మికులు సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని విపక్ష నేతలు స్పష్టం చేశారు.
సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు దీక్ష విరమణ - cpi leader kunamneni sambashiva rao
ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని నిరవధిక నిరాహార దీక్షకు దిగిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు దీక్ష విరమించారు. ఆయన చేత అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాల నాయకులు దీక్ష విరమింపజేశారు.
దీక్ష విరమింపజేస్తున్న నేతలు