Kunamneni Comments on BRS Party :రాజకీయ క్రీడలో గెలుపు, ఓటములు సహజం. ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కూడా అంతమాత్రాన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో చూస్తామనడం సరైంది కాదనీ కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. పాత ప్రభుత్వం ఎందుకు విఫలమైందో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలన చేసి పని చేయాల్సి ఉంటుందని సూచించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా కూనంనేని పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Kunamneni Speech in Telangana Assembly Sessions :2020లో 17 రోజులు, 2023లో 11 రోజులు మాత్రమే సభ నడిచిందన్న ఆయన ఈ దఫా అసెంబ్లీని ఎక్కువ రోజులు నిర్వహించేలా చూడాలని సభను కోరారు. నిర్మాణాత్మకంగా సభలో సభ్యులు మాట్లాడాలని, వాటిలోనూ సభ్యుల మాటలు ఆరోగ్యదాయకంగా ఉండాలని కూనంనేని ఆశించారు. వ్యక్తిగత దూషణకు వెళ్లకుండా సభను పక్కదారి పట్టించకుండా మాట్లాడాలని కోరారు.
ఫామ్ హౌస్ వడ్లపై విచారణకు సిద్ధమా : రేవంత్ రెడ్డి
అప్పుడే ప్రజా సమస్యలకు పెద్ద పీఠ వేయొచ్చని తన భావాన్ని వ్యక్తపరిచారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి(YS Rajasekhar Reddy) ఆనాడు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని, జలయజ్ఞానికి నిధులు వాటంతట అవే సమకూరాయని తెలిపారు. హామీలు నెరవేర్చేందుకు డబ్బు ఇబ్బంది కాదని, కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాల్సి ఉందని’ అన్నారు.
దశాబ్ద కాలంపాటు అధికారంలో ఉన్నబీఆర్ఎస్ పార్టీఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. కొంత మంది సభ్యులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. పార్టీ మారిని ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓటమి(BRS Defeat) చవి చూశారనీ గుర్తు చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సరైంది కాదన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలయ్యిందని అన్నారు.