సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని నూతనంగా ఏర్పాటు చేసిన గంగపుత్ర సంఘం కార్యాలయాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తన సొంత భూమిని గంగపుత్ర సంఘం కోసం కేటాయించడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు తెలంగాణలోని కులవృత్తులను, సంఘాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికి న్యాయం చేస్తున్నారని కార్పొరేటర్ నరసింహ యాదవ్ తెలిపారు.
గంగపుత్ర సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - kukatpally mla madhavaram krishnarao
మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో ఏర్పాటు చేసిన గంగపుత్ర సంఘం కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
గంగపుత్ర సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
అదేవిధంగా పక్కనే ఉన్న నాయి బ్రాహ్మణ సంఘానికి కూడా భూమిని ఇచ్చినట్లు వెల్లడించారు. గంగపుత్ర సంఘానికి ద్విచక్ర వాహనాలను కూడా అందించి వారికి తోడ్పాటు అందిస్తామని... ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. వీధి వ్యాపారులకు, ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసుకునే వారికి పది వేల రూపాయల చొప్పున... ఇప్పటివరకు డివిజన్లో 200 మందికి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: హైదరాబాద్‌కు హెరిటేజ్ గుర్తింపు వచ్చేలా కృషిచేస్తా: కేటీఆర్