'బ్యాంకు ఉద్యోగిపై దాడి కేసులో నిందితులకు రిమాండ్' - KUKATPALLY ACCUSED SHIFTED TO CHARLAPALLI JAIL
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఇటీవల బ్యాంకు ఉద్యోగిపై జరిగిన దాడి కేసులో నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.
!['బ్యాంకు ఉద్యోగిపై దాడి కేసులో నిందితులకు రిమాండ్'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5080707-thumbnail-3x2-kp.jpg)
కూకట్ పల్లి మైత్రి నగర్లో మంగళవారం రాత్రి బ్యాంకు ఉద్యోగిపై జరిగిన దాడిలో తెరాస నేతతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం అర్ధరాత్రి కారులో తన ఇంటికి వచ్చిన కస్తూరి రాజేష్‌ను అడ్డగించిన నిమ్మల సంతోష్ రావు, అతని అనుచరులు...తమ వాహనాలను అడ్డంగా పెట్టారు. వాహనాలు తొలగించమన్నందుకు రాజేష్, సహా వాచ్మెన్ దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజేష్ కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నిందితులు... చర్లపల్లి జైలుకు తరలింపు
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిమ్మల సంతోష్‌తో పాటు అతని అనుచరులు మహేష్ కుమార్, నవీన్ కుమార్, యాదగిరి, చక్రధర్, పరుచూరి క్రాంతి కిరణ్‌లను శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. కూకట్ పల్లి న్యాయమూర్తి శ్రీదేవి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించడం వల్ల పోలీసులు చర్లపల్లి కారాగారానికి తరలించారు.