అనాథగా చేరదీసి.. అయినోళ్ల చెంతకు చేర్చి! - మతిస్థిమితం లేని వారు
మతిస్థిమితం లేని ఓ మహిళను చేరదీసి పది రోజుల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు కూకట్‌పల్లి జోనల్ అధికారులు. కూకట్‌పల్లి పరిధిలో మార్చి 30న ఓ మహిళ రోడ్డు పక్కన పడి ఉండటం గమనించిన జోనల్ కమిషనర్ మమత, అధికారులతో కలిసి ఆమెను చేరదీసి.. శివానంద కేంద్రానికి తరలించారు. మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్ల ఇన్నాళ్లు అక్కడే ఉంచి సపర్యలు చేశారు. శుక్రవారం తన పేరు మహబూబ్‌బీ అని చెప్పి.. ఇల్లు సమీపంలో ఉందని చెప్పడంతో ఆమెను సీఈఓ పాపన్నగౌడ్ తీసుకెళ్లగా కుటుంబసభ్యులను గుర్తుపట్టింది. దీంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేవు. వారు కూకట్‌పల్లి జోనల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Hyderabad latest news
.