అఖిలాండకోటి బ్రహ్మండనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి అర్చకులు వైభవంగా నిర్వహించారు. స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుడు ప్రదక్షణగా తిరువీధుల్లో ఊరేగుతూ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించడానికే సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణకు, వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఇవాళ రాత్రి 8 గంటలకు పెద్ద శేషవాహన సేవలో వాహన సేవలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవ అక్టోబర్ నాలుగున నిర్వహిస్తారు. ఆఖరి రోజున శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. 5 గంటల 23 నిమిషాల నుంచి 6 గంటల మధ్య బ్రహ్మోత్సవాలకు ధ్వజావరోహనం నిర్వహిస్తారు.