తెలంగాణ

telangana

ETV Bharat / state

kuchipudi: అలరించిన కూచిపూడి నృత్యం.. శిల్పారామంలో ప్రదర్శన - రమాదేవి బృందం

అత్యంత మధుర గానాలతో కూచిపూడి నృత్యం అభిమానించే కళాకారులకు కనువిందు చేసింది ప్రముఖ నృత్య కళాకారిణి రమాదేవి బృందం. హైదరాబాద్​ మాదాపూర్​లోని శిల్పారామంలో నిర్వహించిన నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారుల నాట్య భంగిమల ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.

Kuchipudi classical dance a
Kuchipudi classical dance a

By

Published : Jul 17, 2021, 11:19 PM IST

రమణీయం ఆ నాట్యం. రసమయం ఆ చిన్నారుల నృత్యం. అత్యంత రసరమ్య మధురంగా సాగిన కూచిపూడి నృత్య ప్రదర్శన చూపరులను కట్టిపడేసింది. మరీ ముఖ్యంగా కూచిపూడి నృత్య కళాభిమానులకు కావల్సినంత ఆనందాన్ని పంచింది. ఈరోజు హైదరాబాద్​ మాదాపూర్​లో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది.

Kuchipudi classical dance

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి రమాదేవి శిష్య బృందం అబ్బుర పరిచే ప్రదర్శన కనబరిచింది. శిల్పారామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యం, అభినయం, వారి హావభావావాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. వారి నృత్య కళాపోషణ ఆద్యంతం తిలకించేలా కనులు తిప్పుకోకుండా చేసింది. శిల్పారామంలోని శ్రీసాయి నటరాజ అకాడమీ ఆఫ్‌ కూచిపూడి డ్యాన్స్‌ ఆధ్వర్యంలో ప్రముఖ గురువు రమాదేవి శిష్య బృందంచే "కూచిపూడి నృత్య రవళి" పేరుతో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ నృత్యాంశాలను నయన మనోహారంగా ప్రదర్శించి కూచిపూడి నృత్య ప్రియులను అలరించారు.

ఇదీ చూడండి:ఈసారి ఖైరతాబాద్ బడా​ గణేశ్ ఎత్తెంత? ఏ రూపంలో దర్శనమిస్తాడో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details