తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు మంత్రి కేటీఆర్‌ - KTR Davos Tour For WEF Conference

KTR Davos Tour For WEF : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వచ్చేనెల 16 నుంచి 20 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) 2023 వార్షిక సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. నిర్వహకుల ఆహ్వనం మేరకు ప్రతియేటా ఈ సదస్సుకు కేటీఆర్ హజరవుతున్నారు.

KTR
కేటీఆర్

By

Published : Dec 21, 2022, 8:18 AM IST

KTR Davos Tour For WEF : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వచ్చేనెల 16 నుంచి 20 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) 2023 వార్షిక సదస్సుకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ హాజరు కానున్నారు. సదస్సుకు ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్‌, బసవరాజ్‌ బొమ్మై, ఏక్‌నాథ్‌ శిందే; కేంద్ర మంత్రులు మాన్‌సుఖ్‌ మాండవీయ, అశ్వినీ వైష్ణవ్‌, స్మృతి ఇరానీలతో పాటు ముఖేశ్‌ అంబానీ తదితర వంద మంది ప్రముఖులను ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానించింది. నిర్వాహకుల ఆహ్వానం మేరకు ప్రతియేటా ఈ సదస్సుకు కేటీఆర్‌ హాజరవుతున్నారు. వచ్చే నెల 14న ఆయన సదస్సు కోసం బయల్దేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details