రెండు రోజులుగా కురిసిన వర్షానికి అతలాకుతలమైన ముషీరాబాద్ నియోజకవర్గంలోని సూర్య నగర్ ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షం వల్ల వరద నీరు వచ్చి అనేక అవస్థలకు గురయ్యామని కేటీఆర్‌కు ప్రజలు విన్నవించుకున్నారు. 2000 సంవత్సరంలో ఇదే ముంపు నెలకొందని... నాటి నుంచి నేటి వరకు తాము ఈ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నమని మహిళలు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇబ్బందులకు గురువుతున్నామని ఆరోపించారు.
ఆదేశాలు
నాలా పరీవాహక ప్రాంతాల ప్రజల పట్ల జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ముంపునకు గురైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. హుస్సేన్ సాగర్ నాలా ప్రహారి విషయంలో తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.