తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి కేటీఆర్ ఇంట విషాదం.. సీఎం కేసీఆర్ సంతాపం - Pakala Harinath Rao latest news

మంత్రి కేటీఆర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య తండ్రి కన్నుమూశారు. వియ్యంకుడు పాకాల హరినాథరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన భౌతికకాయానికి సీఎం నివాళి అర్పించారు. తండ్రిని కోల్పోయిన కోడలు శైలిమను.. వారి కుటుంబ సభ్యులను కేసీఆర్ దంపతులు ఓదార్చారు.

KTR
KTR

By

Published : Dec 29, 2022, 4:43 PM IST

Updated : Dec 29, 2022, 7:45 PM IST

మంత్రి కేటీఆర్ మామ, కేసీఆర్ వియ్యంకుడు హరినాథరావు మరణించారు. అనారోగ్యంతో ఆయన ఈ నెల 27న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం కన్నుమూశారు. అక్యూట్ కరోనరీ సిండ్రోమ్, కార్డియోజెనిక్ షాక్, అనాక్సిక్ బ్రెయిన్ ఇంజ్యూరీతో హరినాథరావు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. హరినాథరావు పార్థివదేహాన్ని రాయదుర్గంలోని వారి నివాసానికి తరలించారు.

హరినాథరావు మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. తండ్రిని కోల్పోయిన కోడలు శైలిమను.. హరినాథరావు కుటుంబ సభ్యులను కేసీఆర్ దంపతులు ఓదార్చారు. హరినాథరావు భౌతికకాయానికి ఎమ్మెల్సీ కవిత, మంత్రులు మహమూద్‌అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, శేరి సుభాష్‌రెడ్డి, వేణుగోపాల చారి, డా.ఆంజనేయ గౌడ్, తదితరులు నివాళులు అర్పించారు.

Last Updated : Dec 29, 2022, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details