తెలంగాణ

telangana

ETV Bharat / state

వైష్ణవిని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: కేటీఆర్ - KTR eagerly waiting to meet 10th grader Vaishnavi

మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. తాజాగా ఓ 10వ తరగతి చదువుతున్న అమ్మాయిని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. అసలు ఆ అమ్మాయి ఎవరు.. మంత్రి ఆ అమ్మాయిని ఎందుకు కలవాలి అనుకుంటున్నారో తెలుసుకుందాం రండి.

KTR tweeted that he was eagerly waiting to meet 10th grader Vaishnavi
వైష్ణవిని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: కేటీఆర్

By

Published : Dec 22, 2022, 7:28 PM IST

భవిష్యత్తు రాజకీయాల్లోకి దిగనున్న యువ రక్తానికి కేటీఆర్ భరోసా ఇచ్చారు. 35వ జాతీయ పుస్తక ప్రదర్శనలో హైదరాబాద్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని, రచయిత వైష్ణవిని కలిసేందుకు ఎదురు చూస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ట్విటర్ వేదికగా తెలిపారు. చిన్న వయసులోనే నాలుగు పుస్తకాలు రచించిన వైష్ణవి.. హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించింది.

ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శనలో ఒక ఫొటో దిగి ట్విటర్‌లో అప్‌లోడ్‌ చేయగా.. ఆ ట్వీట్‌కు కేటీఆర్‌ స్పందించారు. అత్యంత అవమానకరమైన, దుర్వినియోగమైన రాజకీయ దళంలో చేరాలని కోరుకుంటున్న యువ రక్తం.. వైష్ణవిని చూస్తుంటే సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details