రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. హైదరాబాద్‌లో మెగా ఏరో ఇంజిన్ ఎమ్మార్వో ఏర్పాటుకు సాఫ్రాన్ సంస్థ ముందుకొచ్చింది. సుమారు 150 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ట్వీట్ చేశారు.
హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి.. కేటీఆర్ వెల్‌కమ్
రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూపు నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు.
హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి.. కేటీఆర్ వెల్‌కమ్
హైదరాబాద్‌లో సాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎమ్మార్వో ప్రపంచంలోనే పెద్దదని తెలిపారు. ప్రపంచస్థాయి సంస్థ భారత్‌లో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్ అని వెల్లడించారు. దీనివల్ల దాదాపు 800 నుంచి వెయ్యిమంది వరకు ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు.
ఇవీ చదవండి:
TAGGED:
ktr tweet on safran company