తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Tweet Today : '3 పంటలా.. 3 గంటలా.. మతం పేరిట మంటలా.. ఏం కావాలో రైతులే తేల్చుకోవాలి' - పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి వార్తలు

KTR Reacts to Revanth reddy comments : కాంగ్రెస్ నోట రైతులకు.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతుకు మూడుపూటలా కరెంట్‌ ఎందుకు అనడం ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు రైతు అంటే చిన్నచూపు ఉందని విమర్శించారు.

KTR Tweet on Revanth Comments
KTR Tweet on Revanth Comments

By

Published : Jul 12, 2023, 12:23 PM IST

Updated : Jul 12, 2023, 1:53 PM IST

KTR Tweet on Revanth Reddy Comments :ఇప్పుడున్న రాజకీయ నేతలంతా ట్విటర్​లో ఎప్పుడు యాక్టివ్​గా ఉంటున్నారు. ఏదైనా సంఘటన జరిగితే చాలు వాటిని వెంటనే పోస్ట్​ చేస్తున్నారు. ఇక రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్అయితే ట్విటర్​లో యమా యాక్టివ్. కేంద్రంపై విమర్శలు, ప్రజా సమస్యలతో పాటు రాష్ట్రాభివృద్ధి, ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు ఆయన ట్విటర్​ను వేదిక చేసుకుంటారు.

KTR Fires on congress : తాజాగా రేవంత్​రెడ్డిఉచిత విద్యుత్​పైచేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్ నోట రైతులకు.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిందని తెలిపారు. అప్పట్లో 7 గంటల విద్యుత్‌ ఇవ్వకుండా ఎగ్గొట్టారన్న కేటీఆర్‌.. ఇవాళ ఉచిత్‌ కరెంట్‌కు ఎగనామం పెట్టే కుట్రలకు తెరతీశారని విమర్శించారు. పొలానికి 3 గంటల విద్యుత్‌ కోసం.. బాహుబలి మోటార్లు పెట్టాలన్న మంత్రి.. మరోసారి 3 గంటల మాటెత్తితే రైతుల చేతిలో మాడు పగలడం ఖాయమని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే ఇప్పటికే ధరణి తీసేస్తామని చెబుతున్నారని ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్​పై కేటీఆర్ ధ్వజమెత్తారు.

BRS Fires On Revanth Comments :రైతుకు మూడుపూటలా కరెంట్‌ ఎందుకు అనడం.. ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు చిన్నకారు రైతు అంటే చిన్నచూపు ఉందని విమర్శించారు. నోట్లు తప్ప రైతుల పాట్లు తెలవని రాబందును నమ్మవద్దన్న కేటీఆర్ .. వారిని నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టడం ఖాయమని పేర్కొన్నారు. రైతన్నలకు ఇది పరీక్షా సమయమని.. రైతును రాజును చేసే మనసున్న సీఎం కేసీఆర్‌ కావాలా? .. 3 గంటల విద్యుత్‌ చాలన్న మోసకారి రాబందు కావాలా.. లేదా మతం పేరిట మంటలు రేపే బీజేపీ కావాలా.. రైతులే తేల్చుకోవాలని అన్నారు. 'కేసీఆర్ నినాదం.. మూడు పంటలు, కాంగ్రెస్ విధానం.. మూడు గంటలు, బీజేపీ విధానం.. మతం పేరిట మంటలు' అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

BRS Protest Against Revanth Reddy Comments :'తెలంగాణలో 95 శాతం మంది రైతులకు 3 ఎకరాల్లోపు భూమి ఉన్నందున అందులో పంటల సాగుకు 3 గంటలసేపు కరెంటు ఇస్తే నీరందించవచ్చు. మొత్తంగా వ్యవసాయానికి రోజూ 8 గంటల సేపు విద్యుత్ చాలు' అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల గులాబీదళం కదం తొక్కింది. పార్టీ పిలుపు మేరకు రోడ్డెక్కిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు.. రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్‌కున్న చిత్తశుద్ధికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలే నిదర్శనమని మంత్రులు పేర్కొన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ నిరంతరం కరెంటు అందిస్తుంటే కాంగ్రెస్‌ కడుపు మండుతోందని.. ఆ పార్టీకి బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్​ పిలుపునిచ్చింది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 12, 2023, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details