KTR Tweet Today : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రజా సమస్యలపై స్పందించేవారు. అక్కడికక్కడే సదరు సమస్యలను సంబంధిత అధికారులను ట్యాగ్ చేసి పరిష్కరించాలని ఆదేశించేవారు. మరోవైపు ఎక్స్ వేదికగానే ఆయన రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని వివరించే వారు. అలాగే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించే వారు.
KTR Tweet On Congress Govt :ఇప్పుడు ఆయన మంత్రి పదవిలో లేరు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇప్పుడు కూడా ఆయన నెట్టింట చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రభుత్వ తీరును ఎక్స్ వేదికగా సమయం వచ్చినప్పుడల్లా ఎండగడుతున్నారు. అదే విధంగా కేసీఆర్ సర్కార్‌పై, తమ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతున్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు, అభయహస్తం హామీల అమల్లో జాప్యాన్ని ఎక్స్ వేదికగా నిలదీస్తున్నారు.
KTR Tweet On KCR Today : ఇక తాజాగా కేటీఆర్ కేసీఆర్‌పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని ఎక్స్‌లో పోస్టు చేసి తిప్పికొట్టారు. ఎన్నికల తర్వాత తనకు చాలా రకాల ఫీడ్‌బ్యాక్‌లు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. అయితే అందులో తనకు చాలా ఆసక్తికరంగా అనిపించిన ఓ ఫీడ్‌బ్యాక్‌ను ఇవాళ ఆయన పోస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసే బదులు కేసీఆర్ 32 యూట్యూబ్ ఛానెల్స్ క్రియేట్ చేసుకుని ఉంటే బాగుండేదని పలువురు నెటిజన్లు సలహా ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. కనీసం ఆ ఛానెళ్లు కేసీఆర్‌పై వస్తున్న నకిలీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఉపయోగపడేవని తెలిపారు.