KTR Tweet on Veg and Nonveg Markets: రాష్ట్రవ్యాప్తంగా సమీకృత మార్కెట్‌లు శరవేగంగా ఏర్పాటవుతున్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయా మార్కెట్‌లలో శాకాహారంతోపాటు మాంసాహారం లభిస్తోందని వివరించారు. పురపాలక శాఖ నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల గురించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఖమ్మం, నారాయణపేట, భువనగిరిలో అందుబాటులోకి వచ్చిన మార్కెట్ల ఫోటోలను షేర్ చేశారు. మార్కెట్ల నిర్మాణానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యేలు, పురపాలక ఛైర్మన్లను కేటీఆర్ ట్విటర్లో అభినందించారు.
CM KCR on Veg and Nonveg Markets : మొన్నటి వరకు జరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల అంశంపై చర్చ జరిగింది. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. శాస్త్రీయ దృక్పథంతో రాష్ట్రవ్యాప్తంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామని కేసీఆర్ శాసనసభలో చెప్పారు. భూమిపై కూరగాయలు పెట్టి విక్రయిస్తే బ్యాక్టీరియా ముప్పు ఉంటుందన్నారు. మోండా మార్కెట్ మాదిరిగా.. రాష్ట్రంలో మార్కెట్లు నిర్మించాలని కలెక్టర్లకు సూచించినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో అధునాతన మార్కెట్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.