తెలంగాణ

telangana

ETV Bharat / state

టీకాల అదనపు వ్యయాన్ని కేంద్రమే భరించాలి: కేటీఆర్​

కరోనా టీకాల ధరలపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ స్పందించారు. ఒకే దేశం - ఒకే పన్ను కోసం జీఎస్టీని అంగీకరించామన్న ఆయన... ఇప్పుడు ఒకే దేశంలో వ్యాక్సిన్లకు రెండు ధరలు చూస్తున్నామని వ్యాఖ్యానించారు.

ktr
కేటీఆర్​

By

Published : Apr 22, 2021, 9:58 AM IST

కొవిడ్ టీకాలకు రాష్ట్రాలకయ్యే అదనపు వ్యయాన్ని కేంద్రం భరించలేదా అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు వ్యాక్సిన్ల ధరపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒకే దేశం - ఒకే పన్ను కోసం జీఎస్టీని అంగీకరించామన్న ఆయన... ఇప్పుడు ఒకే దేశంలో వ్యాక్సిన్లకు రెండు ధరలు చూస్తున్నామని వ్యాఖ్యానించారు.

కేంద్రానికి 150 రూపాయలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయల ధర అంటున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు టీకాలకు అయ్యే అదనపు వ్యయాన్ని కేంద్రం పీఎం కేర్స్ నిధి నుంచి భరించలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 5,567 కొవిడ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details