తెలంగాణ

telangana

ETV Bharat / state

Ktr Tweet on Amith shah visit: 'కేటీఆర్ కొత్త నిర్వచనం.. భాజపా అంటే బక్వాస్ జుమ్లా పార్టీ'

మంత్రి కేటీఆర్ మరోసారి దిల్లీ భాజపా నేతలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి మరో పొలిటికల్ టూరిస్ట్​ అంటూ ఎద్దేవా చేశారు. మొన్ననే ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇవాళ మరో టూరిస్ట్ అంటూ ట్విటర్​ ద్వారా విమర్శలు చేశారు.

Ktr Tweet on Amith shah visit
Ktr Tweet on Amith shah visit

By

Published : May 14, 2022, 11:12 PM IST

Updated : May 14, 2022, 11:37 PM IST

రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొన్ననే ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇవాళ మరో టూరిస్ట్ వచ్చాడంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ టూరిస్టుల సీజన్​ నడుస్తోందని ఎద్దేవా చేశారు. వచ్చాడు.. తిన్నాడు.. తాగాడు.. వెళ్లాడు.. అంటూ అమిత్​ షాను ఉద్దేశించి ట్విటర్​లో సైటైర్ వేశారు.

భాజపాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏమి ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికీ కూడా అదే తంతు ఇంకా కొనసాగుతోందన్నారు. భాజపా అంటే 'బక్వాస్ జుమ్లా పార్టీ' అని తీవ్రంగా విమర్శించారు.

వలస పక్షులు వస్తుంటాయి.. పోతుంటాయి: హరీశ్ రావు

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటనపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు సెటైరికల్‌గా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘వలస పక్షులు వస్తుంటాయి.. పోతుంటాయి. ఇష్టమైన ప్రదేశాలు, ఆహారం ఆస్వాదించి సంతోషంగా వెళ్తాయి. ఇవాళ ప్రపంచ వలస పక్షుల దినోత్సవం కావడం యాదృచ్ఛికం’’ అని హరీశ్‌రావు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు #AmitShahVisitsTelangana, #WorldMigratoryBirdDay హ్యాష్‌ ట్యాగ్‌లతో పాటు పక్షులు ఎగురుతూ వెళ్తు్న్న ఫొటోను ఆయన పోస్ట్‌ చేశారు.

ఇవీ చూడండి:'తెలంగాణలో నిజాం ప్రభువును గద్దె దించేందుకు సిద్ధమవ్వండి..'

"జనగణమనలో 'సింధ్'​ను తొలగించండి.. పాక్​ను కీర్తిస్తూ పాడేదెలా?"

Last Updated : May 14, 2022, 11:37 PM IST

ABOUT THE AUTHOR

...view details