ప్రశాంతత ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల భద్రత, రక్షణకు తెరాస ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు. అభద్రతకు బదులు భద్రతకు ఓటు వేయాలని విన్నవించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, షీ టీమ్స్, భరోసా కేంద్రాలు తదితర విషయాలతో ఓ వీడియోను పంచుకున్నారు. మరింత అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని కోరారు.
'ప్రశాంతతతోనే ఆర్థికాభివృద్ధి... తెరాసతోనే అది సాధ్యం' - హైదరాబాద్లో అభివృద్ధి పనులు
ప్రజల భద్రత, రక్షణకు తెరాస ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆరేళ్లలో హైదరాబాద్లో చేసిన అభివృద్ధిపై ట్విట్టర్లో వీడియోను పంచుకున్నారు.
'ప్రశాంతత ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది'