KTR Tweet Today: దేశంలోనే దాదాపు 40 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ఓ రైతుకు ఇంటికి వెళ్లి.. ఆ కుటుంబానికి బీమా చెక్కును అందించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఎమ్మెల్యేను అభినందించారు.
రైతు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: కేటీఆర్ - KTR on Rythu bheema latest news
KTR Tweet Today: రాష్ట్రంలో రైతు బీమా పథకం అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతోందని కేటీఆర్ అన్నారు. రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఈ పథకం కింద నేటికి రూ.4,770 కోట్ల నిధుల పంపిణీ చేశామని ట్విటర్ వేదికగా ఆయన తెలిపారు.
KTR
ముఖ్యమంత్రి కేసిఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకం.. రాష్ట్రంలోని అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటి వరకూ 95,416 కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. రైతు బీమా పథకం కింద నేటికి రూ.4,770 కోట్ల నిధుల పంపిణీ జరిగిందని వివరించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: