KTR Tweet on Mission Bhagiratha Scheme : దేశంలోనే తెలంగాణ మొదటి సారిప్రతి ఇంటికి మిషన్ భగీరథ(Mission Bhagiratha Scheme in Telangana)లో భాగంగా వాటర్ కనెక్షన్ ఇచ్చిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎక్స్(ట్విటర్)లో ద ఇండియన్ ఇండెక్స్ చేసిన ట్వీట్‌పై ఆయన స్పందిచారు. దేశంలో ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జాబితా ట్వీట్ చేసిన ఇండియన్ ఇండెక్స్.. తొలి స్థానంలో తెలంగాణ ఉన్నట్లు పేర్కొంది.
దీనిపై స్పందిచిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. విజన్ ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. తెలంగాణలో మిషన్ భగీరథ విజయవంతం అవ్వడం చూసి... కేంద్రం హర్ ఘర్ జల్ అనే కార్యక్రమాన్ని తెచ్చిందని తెలిపారు. ఈరోజు తెలంగాణ ఏది చేస్తే.. దేశం అది అనుసరిస్తుందని ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు.
"దేశంలోనే మొదటిసారి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పథకంలో భాగంగా తెలంగాణ వాటర్ కనెక్షన్ ఇచ్చింది. విజన్ ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే సాధ్యమైంది. తెలంగాణను చూసే కొన్ని ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈరోజు తెలంగాణ ఏది చేస్తే.. దేశం అది అనుసరిస్తోంది."- కేటీఆర్ ట్వీట్
The Indian Index Tweet on Mission Bhagiratha : అంతకు ముందు ద ఇండియన్ ఇండెక్స్ తన ట్విటర్లో దేశంలో ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు జాబితాను అందులో పేర్కొంది. ఆ జాబితాలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉండగా.. గుజరాత్, గోవా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఇంటికి మంచి నీటి పథకం హర్ ఘర్ జల్లో భాగంగా ఈ లెక్కలను ద ఇండియన్ ఇండెక్స్ ప్రవేశపెట్టింది.